విమానాశ్రయంలో.. రష్యా పర్యాటకుడు ఆత్మహత్య...

- January 27, 2017 , by Maagulf
విమానాశ్రయంలో.. రష్యా పర్యాటకుడు ఆత్మహత్య...

తిరువనంతపురం: రష్యాకు చెందిన ఓ పర్యాటకుడు విమానాశ్రయంలో ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు 30 ఏళ్ళ డానీగా పోలీసులు గుర్తించారు. కేరళలోని తిరువనంతపురం ఎయిర్‌పోర్టులో ఎత్తైన భవంతిపై నుంచి అతడు కిందకు దూకాడు. తీవ్రంగా గాయపడిన డానీని ఆసుపత్రికిగా తీసుకెళ్ళగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.
ముంబై వెళ్ళేందుకు సిద్ధమైన రష్యా టూరిస్ట్ డానీ ఇమిగ్రేషన్ క్లియరెన్స్ సమస్య కారణంగా ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. మృత దేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి భద్రపరచడంతోపాటు ఈ విషయాన్ని రష్యా కాన్సులేట్‌కు సమాచారం అందించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com