2018 లో ప్రారంభం కానున్న ఒమన్ కొత్త అక్వేరియం

- January 27, 2017 , by Maagulf
2018 లో ప్రారంభం కానున్న ఒమన్ కొత్త అక్వేరియం

మస్కట్ : ముప్పై వేల సముద్ర జంతువులు, చిన్న చిన్నరొయ్యలు నుండి పెద్ద సొరచేపలు ఉండే కొత్త అక్వేరియంను 2018 మొదటి త్రైమాసికంలో సీబ్ లోని పామ్ మాల్ ప్రారంభించడానికి ఏర్పాట్లు చక చక జరిగిపోతున్నాయి. 8,000 చదరపు మీటర్ల ఆక్వేరియం 55 ప్రదర్శన ట్యాంకులు ఉంటాయి .ఈ ట్యాంక్ 1.7  మిలియన్ లీటర్ల సముద్ర నీటితో నింపబడి ఉంటుంది మరియు ఒమన్ తీరాలలో కనబడే చేపలు మరియు సొరచేపలను అందులో వదులుతారు.ప్రధాన ట్యాంక్ యొక్క ఒక భాగం ద్వారా నడుస్తున్న డెమి- సొరంగం, మరియు ప్రధాన గ్యాలరీలో పెద్ద యాక్రిలిక్ వీక్షణ ప్యానెల్ ఉంటుంది. యాక్రిలిక్ 70 సెంటీమీటర్ల మందం ఉంటుంది. ఈ ట్యాంక్ లో 20,000 సముద్ర జంతువులు కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నట్లు గ్రూప్ ఇంటర్నేషనల్ లిమిటెడ్యొక్క సీఈఓ అడ్రియన్ తొలిదయ్ తెలిపారు. కన్సల్టెన్సీ, పర్యవేక్షణ కోసం అక్వేరియం ప్రత్యేక నిర్వహణ, కార్యాచరణ సేవలు అందించడానికి నియమితులయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com