వకూద్: కొత్తగా 10 ఫ్యూల్ స్టేషన్స్
- January 28, 2017
కొత్తగా ఏర్పాటైన రెండు కొత్త ఫ్యూల్ స్టేషన్స్ (అల్ మషాఫ్ మరియు అబు నఖ్లా) త్వరలో అందుబాటులోకి వస్తాయని ఖతార్ ఫ్యూయల్ (వకూద్) పేర్కొంది. వకూద్ కొత్తగా దేశవ్యాప్తంగా మరో 10 ఫ్యూల్ స్టేషన్స్ని ఈ ఏడాది ప్రారంభించాలనుకుంటున్నట్లు తెలిపింది. ప్రస్తుతం దేశంలో 43 పెట్రోల్ స్టేషన్స్ అలాగే 5 మొబైల్ ఫ్యూల్ స్టేషన్స్ని నిర్వహిస్తోంది. కొత్త స్టేషన్స్ వాహనదారులకు అనుగుణంగా, స్ట్రాటజిక్ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది వకూద్ సంస్థ. వాహన తయారీదారులు ఫ్యూయల్ ట్యాంక్ క్యాప్స్ని ఏవైపు ఏర్పాటు చేసినాసరే, వాటికి అందుబాటులో ఉండేలా పెద్ద పెద్ద పైప్స్తో పెట్రోల్ స్టేషన్స్ని తీర్చిదిద్దుతున్నట్లు వకూద్ అధికారులు చెప్పారు. ఈ చర్యల వల్ల వాహనదారులు త్వరగా తమ వాహనాల్ని ఫ్యూయలింగ్ చేసుకోగలుగుతారని వారు వివరించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







