రెండు కొత్త ఫీచర్లు వాట్సాప్ బీటాలో...
- January 28, 2017
వాషింగ్టన్ : వాట్సాప్ బీటా (ప్రయోగాత్మక సేవలు)లోని కొన్ని వెర్షన్లలో మరో రెండు కొత్త ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. గ్రూప్ చాట్‌లలో లైవ్ లొకేషన్ ఫీచర్‌ను వాట్సాప్ ప్రవేశపెట్టింది. దీంతో గ్రూప్ సభ్యుల్లో ఎవరు ఎక్కుడున్నారో మిగిలిన వినియోగదారులు సులభంగా తెలుసుకోవచ్చు. సభ్యులంతా ఒకచోట కలుసుకోవాలని అనుకున్నప్పుడు ఎవరెంత దూరంలో ఉన్నారో తెలుసుకోడానికి ఇది బాగా ఉపయోగపడనుంది.
ఇందుకోసం వినియోగదారులు గ్రూప్‌లోకి వెళ్లి 'షో మై ఫ్రెండ్స్'అనే ఆప్షన్ ను యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక రెండో ఫీచర్ విషయానికి వస్తే వినియోగదారులు ఒకసారి పంపిన సందేశాలను కూడా మళ్లీ వెనక్కు తీసుకుని మార్పులు చేసి పంపొచ్చు.
అయితే సందేశాన్ని పొందిన వ్యక్తి అప్పటికి దానిని చదివి ఉండక పోతేనే ఇది సాధ్యమవుతుంది. వాట్సాప్ ఫీచర్లను ఎప్పటికప్పుడు తెలియజేసే @WABetaInfo అనే సంస్థ ఈ వివరాలను అందించింది.
తాజా వార్తలు
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!







