అగ్నిప్రమాదాలు-భద్రతపై పిల్లలకు పాఠశాలలోనే శిక్షణ
- September 14, 2015
అగ్నిప్రమాదాలు -భద్రతను గురించిన అవగాహన కార్యక్రమాలు, సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ పబ్లిక్ ఆధారిటీ(PACDA) వారికి సహకరించడం వంటి విషయాలు కూడా పిల్లలకు పాఠశాలలోనే బోధించాలని అగ్ని మరియు భద్రత అధికారులు సూచిస్తున్నారు. దేశ, విదేశాల నుండి వచ్చిన 85 ప్రదర్శకులు ప్రదర్శిస్తున్న అత్యాధునిక ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానం మరియు మార్గదర్శక పరిష్కారాలతో కూడిన “ద ఒమాన్ ఫైర్, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అండ్ సైబర్ సెక్యూరిటీ ఎగ్జిబిషన్”, హిజ్ హైనెస్ హరీబ్ బిన్ తువైని బిన్ షిహబ్ అల్ సైద్, అసిస్టెంట్ సెక్రెటరీ జనరల్ ఫర్ కాన్ఫరెన్సెస్ ఎట్ ఒమాన్ ఎగ్జిబిషన్ సెంటర్ వారిచే ఆవిష్కరించబడింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- మనదేశంలో ఒమనీయులు, ఇంకా వివిధ దేశాలనుండి, వివిధ పరిసరాల నుండి వచ్చిన అనేక మంది ప్రజలతో కూడిన సమాజం ఉందని, సామాజిక భాద్యత అనేది చిన్నతనంలోనే, అంటే పాఠశాలల్లోనే మొదలవాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇందుకు షాపింగ్ మాల్స్ మరియు హొటెల్స్ వంటి వాటిలో పబ్లిక్ కాంపైన్లు నిర్వహించాలని,PACDA వారి నిరంతర ఉనికి కూడా సహాయకారి ఔతుందని, దేశ భద్రత వీరిద్దరి సమిష్టి కృషిలోనేద్వారానే అవగాహన పెరిగి అగ్నిప్రమాదాలు అరికట్టబడతాయని ఆయన బోధపరిచారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







