భారత సైన్యంపై మంచు చరియల దాడి
- January 29, 2017
జమ్మూకాశ్మీర్ సరిహద్దుల్లో భారత సైన్యంపై శత్రువు దాడి కొనసాగుతోంది. ప్రతి సీజన్లో సైనిక స్థావరాల పక్కనే పొంచి ఉండే ఎనిమీ.. జవాన్లు ఏమరుపాటుగా ఉన్నప్పుడు హఠాత్తుగా విరుచుకుపడి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. ఈ శత్రువు ధాటికి ఈ ఏడాది ఇప్పటికే 20 మంది మృతి చెందడంతో సరిహద్దుల్లో జవాన్లను అప్రమత్తం చేసింది ఆర్మీ.
సరిహద్దుల్లో కవ్వించే పాక్ సైన్యం ఓ వైపు, సమయం దొరికితే దేశంలోకి చొరబడేందుకు సిద్ధంగా ఉండే ఉగ్రవాదులు మరోవైపు, అయినా జమ్ముకాశ్మీర్ బోర్డర్లో వారిని సమర్థంగా ఎదుర్కుంటోంది భారత సైన్యం. అప్పుడప్పుడూ మెరుపుదాడులతో సర్ ప్రైజ్ ఇస్తోంది. కానీ ఒక శత్రువు రాకను పసిగట్టడంలో మాత్రం పొరపాటు పడుతోంది. సైనికుల ప్రాణాలు బలిపెడుతోంది. అదే ప్రతి ఏటా శీతాకాలంలో బీఎస్ఎఫ్ జవాన్లపై విరుచుకుపడుతున్న మంచు మృత్యువు. ఈ ఏడాది కూడా ఉత్తరాది రాష్ట్రాల్లో చలి తీవ్రత మరింత పెరిగింది. జమ్ముకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో మంచు విపరీతంగా కురుస్తోంది. మిగతా రాష్ట్రాల్లో హిమపాతాన్ని స్థానికులు, పర్యాటకులు ఆస్వాదిస్తున్నా.. జమ్ముకాశ్మీర్‌లో సరిహద్దుల్లో గస్తీ కాసే జవాన్లకు మంచు చరియలు మృత్యు ఘంటికలు మోగిస్తున్నాయి. హఠాత్తుగా ముంచుకొచ్చి కప్పేస్తున్న మంచు చరియలు.. తమ కింద జవాన్లను సజీవ సమాధి చేసేస్తున్నాయి. మంగళవారం నుంచి విరుచుకపడుతున్న మంచుచరియలు ఇప్పటికే 15 మంది జవాన్ల సహా 21 మంది ప్రాణాలను బలితీసుకున్నాయి. తాజాగా భారీ హిమపాతంలో చిక్కుకుపోయిన ఐదుగురు జవాన్లను సజీవంగా వెలికితీసి మరింత ప్రాణనష్టం జరగకుండా తప్పించింది సైన్యం. కుప్వారా జిల్లాలో ఆర్మీ శిబిరాన్ని మంచు పూర్తిగా కప్పేయడంతో సహాయ చర్యలకు దిగి లోపల కూరుకుపోయి ఐదుగురిని వెలికితీసింది. ఉత్తర కాశ్మీర్‌లోని రిమోట్ ఏరియా గురెజ్ సెక్టార్లో ఇవి జరుగుతుండడంతో వేగంగా అక్కడికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టడానికి ఆర్మీకి కష్టంగా మారింది. రాబోయే 24 గంటల్లో లోయల్లో, కొండ ప్రాంతాల వారు అత్యంత అప్రమత్తంగా ఉండాలని స్థానిక అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఇళ్ల పైన మంచు పేరుకుని కూలిపోకుండా, ఎప్పటికప్పుడు దాన్ని తొలగించాలని ఆదేశాలిచ్చారు.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







