కచ్చి గోషి బిర్యానీ...
- January 29, 2017
కావాల్సిన పదార్థాలు: మటన్-కిలో, బాస్మతి రైస్-కిలో, పెరుగు-200 గ్రా, లెమన్ జ్యూస్-మూడు టీ స్పూన్ల మసాలా దినుసులు: 20 గ్రా. చిల్లీ పౌడర్, 30 గ్రా. ధనియాల పౌడర్, 100 గ్రా.జింజర్ గార్లిక్ పేస్ట్, 50 గ్రా. ఉప్పు, 20 గ్రా. మిక్స్ గరం మసాలా, 100 గ్రా. నూనె, 30 గ్రా. ఫ్రైడ్ ఆనియన్, 15 గ్రా. తరిగిన కొత్తిమిర, 15గ్రా. తరిగిన పుదీనా, 5గ్రా. బే లీవ్స్, 150గ్రా. వెన్న, 5 లీటర్ల నీరు.
తయారీ విధానం: కేజీ మాసం తీసుకుని అందులో లెమన్ జ్యూస్, జింజర్ గార్లిక్ పేస్ట్, గరం మసాలా పౌడర్, ఫ్రైడ్ ఆనియన్, పెరుగు, తరిగిన కొతిమిర, పుదీనా, ధనియాల పౌడర్, నూనె కలిపి రెండు మూడు గంటల పాటు బాగా నానబెట్టాలి. 5 లీటర్ల నీటిని ఒక బౌల్లో తీసుకుని 25 నిమిషాల పాటు మరగబెట్టాలి. తరువాత ఇందులో పైన సూచించిన మోతాదులో ఉప్పు, 10గ్రా. గరం మసాలా, బేలీవ్స్ కలపాలి. గంటపాటు నాన బెట్టిన బాస్మతి రైస్‌ని మరగించిన నీటికి కలపాలి. ఇప్పుడు సగం బిర్యానీ తయారు అయినట్లే. ఈ రైస్‌ని తీసుకుని పైన సూచించిన విధంగా.. బాగా నాన బెట్టిన మటన్‌పై వేయాలి. రైస్ పైగాన వెన్న, గార్లిక్ కలపాలి. ఇలా తయారైన బిర్యానీపై మూత ఉంచి ఆటాతో సీల్‌వేసి 20-25 నిమిషాల పాటు గ్యాస్‌ని సిమ్‌లో ఉంచి ఉడకబెట్టాలి. తరువాత మూతపై 20 నిమిషాల పాటు వేడి వేడి నిప్పులు పోయాలి. తరువాత మూత తీస్తే ఘుమ ఘుమలాడే బిర్యానీ మనకు నోరూరిస్తుంది. దీనికి తరిగిన కొతిమిర, పుదీనా, క్యాష్యూనట్, ఫ్రైడ్ ఆనియన్, మిర్చీ ముక్కలు కలపాలి. మన కావాల్సిన కచ్చి గోషి బిర్యానీ తయారైంది. ఇలా వేడి వేడిగా ఉన్న బిర్యానీని టేస్ట్ చేస్తే ఆ మజాయే వేరు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్‌లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







