ఇంగ్లాండ్ పై విజయభేరి మోగించిన భారత్
- January 29, 2017
ఇంగ్లండ్‌తో జరుగుతున్న సెకండ్ టీ20 మ్యాచ్ చివరి వరకూ ఉత్కంఠగా సాగింది. కోహ్లసేన 5 పరుగుల తేడాతో గెలిచింది. సిరీస్‌ను 1-1 తేడాతో సమం చేసింది. దీంతో ఫిబ్రవరి 1న జరగబోయే మ్యాచ్‌లో సిరీస్ విజేత ఎవరో తేలనుంది. ఇంగ్లండ్ జట్టు చివరి ఓవర్‌లో 8 పరుగులు చేయాల్సి ఉండగా భారత బౌలర్ బూమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మొదటి, నాలుగో బంతుల్లో వికెట్లు తీశాడు. అటు ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్‌కు కూడా టెన్షన్ పెరిగింది. మైదానంలో అందరూ ఉత్కంఠతో చూశారు. చివరి బంతికి 6 పరుగులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. నిజానికి మూడు ఓవర్లలో 27 పరుగులు చేయాల్సి సమయంలో బూమ్రా 18వ ఓవర్ వేసిన బూమ్రా 3 పరుగులు మాత్రమే ఇచ్చాడు. తర్వాత ఓవర్ వేసిన నెహ్రా 16 పరుగులు ఇచ్చాడు. అయితే చివరి ఓవర్‌ను వేసిన బూమ్రా మ్యాజిక్ చేసి మ్యాచ్ గెలిపించాడు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్‌లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







