సిరివెన్నెల వేటూరి సాహితీ పీఠం పురస్కారం...
- January 29, 2017
తుని,జనవరి 29: రాసిన ప్రతి పాట ప్రజల హృదయాన్ని తాకాలనేదే తన ఆరాటమని ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాసి్త్ర అన్నారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో వేటూరి సాహితీ పీఠం సప్తమ పురస్కారాన్ని ఆదివారం సిరివెన్నెలకు అందించారు. వేటూరి సాహితీ పీఠం, శ్రీప్రకాష్ విద్యాసంస్థల కల్చరల్ అసోసియేషన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సిరివెన్నెల మాట్లాడుతూ వ్యక్తి భావాలను అనుసరించి అతనిని ఆరాధించాలన్నారు. వేటూరి వయసు తన తండ్రి వయసు ఒక్కటేనని, తల్లిదండ్రుల తర్వాత వేటూరినే నాన్నా అని పిలిచేవాడినన్నారు. కాకినాడలో సినిమాలు చూసేటప్పుడు వేటూరి పాటలను విని సాహిత్యంపై మక్కువ పెంచుకున్నానన్నారు.
తనకు సినిమాల్లోకి వెళ్లే ఉద్దేశ్యమే లేదని ఆంధ్రా యూనివర్సిటీలో అధ్యాపకుడిగా చేరడమే తన లక్ష్యంగా ఉండేదన్నారు. ప్రవృత్తిని వృత్తిగా చేసుకున్నానని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







