విశ్వసుందరి కిరీటం ఫ్రాన్స్‌ భామకు...

- January 29, 2017 , by Maagulf
విశ్వసుందరి కిరీటం ఫ్రాన్స్‌ భామకు...

మనీలా: ఫ్రాన్స్‌కు చెందిన 23ఏళ్ల ఇరిస్‌ మిట్టెనరి ఈ ఏడాది మిస్‌ యూనివర్స్‌గా ఎంపికైంది. ఫిలిప్పైన్స్‌లో జరిగిన విశ్వసుందరి పోటీల్లో హోస్ట్‌ స్టీవ్‌ హార్వే.. మిస్‌ ఫ్రాన్స్‌ ఇరిస్‌ను విజేతగా ప్రకటించారు. గతేడాది విశ్వసుందరి కిరీటం సొంతం చేసుకున్న ఫిలిప్పైన్స్‌ భామ పియా వుట్జ్‌బక్‌ ఇరిస్‌కు కిరీటం అలంకరించారు. ఈ పోటీల్లో తొలి రన్నరప్‌ మిస్‌ హైతి రక్వెల్‌ పెలిస్సైర్‌, రెండో రన్నరప్‌గా మిస్‌ కొలంబియా ఆండ్రియా తొవర్‌ నిలిచారు. మిస్‌ యూనివర్స్‌ ఇరిస్‌ ఫ్రాన్స్‌ ఉత్తర ప్రాంతంలోని లిల్లే పట్టణంలో జన్మించారు. డెంటల్‌ సర్జరీలో డిగ్రీ చేశారు. క్రీడలు, ప్రయాణాలు చేయడంతో పాటు ఫ్రెంచ్‌ వంటకాలు చేయడం ఆమె అభిరుచి.

ఈ పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన రోహ్మిత హరిమూర్తి చాలా వెనుకబడిపోయారు. ఆమెకు టాప్‌ 13లో కూడా స్థానం దక్కలేదు. 1994లో మిస్‌ యూనివర్స్‌ కిరీటం గెలుచుకున్న భారత్‌కు చెందిన సుస్మితాసేన్‌ న్యాయనిర్ణేతల్లో ఒకరుగా వ్యవహరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com