సామాన్యుడు 'బిగ్ బాస్' అయ్యాడు...
- January 30, 2017
ముంబై: మూడు నెలల పాటు ఉత్కంఠభరితంగా సాగిన సెలబ్రిటీ రియాలిటీ షో బిగ్ బాస్-10లో సామాన్యుడు విజేతగా నిలిచాడు. హర్యానాకు చెందిన మన్ వీర్ గుజ్జర్ విజేతగా అవతరించాడు. తన స్నేహితుల పట్ల అతడు చూపిన నిజాయితీ, అంకితభావంతో లక్షలాది మంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. సామాన్య ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలు అతడికి మద్దతుగా నిలిచారు. ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటి, మోడల్, ఎంటీవీ వ్యాఖ్యాత గుర్బానీ జడ్జ్ ను దాటుకుని మన్ వీర్ 'బిగ్ బాస్' టైటిల్ సొంతం చేసుకున్నాడు.
మన్ వీర్ ను సల్మాన్ ఖాన్ విజేతగా ప్రకటించగానే అతడి తండ్రి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు. ప్రైజ్ మనీగా వచ్చే రూ. 40 లక్షల మొత్తాన్ని తన కుమారుడు సేవా కార్యక్రమాలకు వినియోగిస్తామని తెలిపాడు.
సల్మాన్ ఖాన్ ఆర్గనైజేషన్ కు ఇస్తామని ప్రకటించాడు.
తాను నిరాడంబరంగా ఉండడానికే ఇష్టపడతానని మన్ వీర్ చెప్పాడు. 'నేను గెలిచిన తర్వాత అందరూ నన్ను పొగుడుతున్నారు. నన్ను స్టార్ లా చూస్తున్నారు. సామాన్య వ్యక్తిలా ఉండడమే నాకు ఇష్టమ'ని మన్ వీర్ తెలిపాడు. బిగ్ బాస్-10 ముగింపు కార్యక్రమంలో సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, యామి గౌతమ్ తో పాటు పోటీదారుల ఆటపాటలు అలరించాయి.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







