సలామ్‌ఎయిర్‌ ఫ్లైట్స్‌: సోమవారం నుంచి

- January 30, 2017 , by Maagulf
సలామ్‌ఎయిర్‌ ఫ్లైట్స్‌: సోమవారం నుంచి

మస్కట్‌: ఒమన్‌ తొలి బడ్జెట్‌ ఎయిర్‌లైన్‌ సలామ్‌ ఎయిర్‌, తన తొలి ఎ320 ఎయిర్‌ బస్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌ (సంహారం) సోమవారం మస్కట్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రారంభించింది. సయ్యిద్‌ తైమూర్‌ బిన్‌ అసద్‌ అల్‌ సైద్‌ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సలామ్‌ ఎయిర్‌ ఛైర్మన్‌ ఖాలిద్‌ బిన్‌ హిలాల్‌ అల్‌ యహ్మాది మాట్లాడుతూ, షేర్‌ హోల్డర్స్‌ నుంచి లభించిన మద్దతుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. సమర్థవంతంగా తమ సేవలు ఈ రంగంలో అందిస్తామని ఆయన చెప్పారు. తమ స్టాఫ్‌లో 68 శాతం ఒమనీయులు ఉన్నందుకు గర్వపడుతున్నట్లు తెలిపారాయన. సలామ్‌ ఎయిర్‌ సిఇఓ ఫ్రాంకోయిస్‌ బౌటెల్లర్‌ మాట్లాడుతూ, సలామ్‌ ఎయిర్‌ టీమ్‌కి, అలాగే భాగస్వాములకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రయాణీకులకు తమ ప్రయాణం అత్యద్భుతంగా ఉండేలా చేయడంతోపాటు, వారికి వీలుగా ప్రయాణ సౌకర్యాన్ని కల్పించేందుకు ప్రాధాన్యతనిస్తామన్నారు. సలాలా మరియు మస్కట్‌ మధ్య ప్రారంభమవుతున్న సలామ్‌ ఎయిర్‌ సేవలు, ముందు ముందు దుబాయ్‌, జెడ్డా, మదినా, కరాచి, సియోల్‌ కోట్‌, ముల్తాన్‌లకు విస్తరించనున్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com