ఒమాన్ లో పెరగనున్న వేతనాలు
- September 15, 2015
ఇటీవల GCC దేశాలలో జరిపిన సర్వే ప్రకారం, ఒమాన్ లో ఉన్న సంస్థలు తమ సిబ్బంది వేతనాలను 5 శాతం పెంచనున్నాయి. ఐతే, 2015 సంవత్సరంలో ఊహించిన 5.4 శాతం కంటే ఇది తక్కువ; ఈ సర్వే 600 బహుళజాతి మరియు స్థానికులకు చెందిన కంపెనీలపై జరుపబడింది. దీనిని నిర్వహించిన ఏ ఆన్ హెవిట్ వారి కధనం ప్రకారం, తగ్గిన చమురు ధరల వల్ల, స్థూల దేశీయోత్పత్తి కూడా తగ్గిందని, విదేశీ పెట్టుబడులు తగ్గాయని, ఇంకా రష్యా, చైనాల వంటి పెద్ద ఆర్ధిక వ్యవస్థల మధ్య గల్ఫ్ దేశాలు ఇబ్బంది పడుతున్నాయని తెలియవచ్చింది. ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా గత 29 సంవత్సరాలుగా వేతనాలపై సర్వే నిర్వహిస్తోంది. ఇక మధ్యప్రాచ్యంలో మొట్టమొదటిసారిగా 2012 లో నిర్వహించింది. ఐతే, సాధారణ ఆర్ధిక పరిస్థితుల కంటే భిన్నమైన కంపెనీ పనితీరు వంటి కారణాలపై వేతనాల పెంపుదల ఆధారపడి ఉంటుందని ఆ’ఆన్ హెవిట్ సర్వే మానేజర్ రొబర్ట్ రిచర్ అభిప్రాయం.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









