అజిత్‌ నిజంగా రాక్‌స్టార్‌: రానా...

- February 02, 2017 , by Maagulf
అజిత్‌ నిజంగా రాక్‌స్టార్‌: రానా...

చెన్నై: తమిళ హీరో అజిత్‌పై దగ్గుబాటి రానా ప్రశంసల జల్లు కురిపించాడు. అజిత్‌ నటిస్తున్న 'వివేగం' సినిమా పోస్టర్‌ను చిత్ర బృందం నిన్న రాత్రి విడుదల చేసింది. కండలు తిరిగిన శరీరంతో ఉన్న అజిత్‌ లుక్‌ ఫ్యాన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంటోంది. అజిత్‌కు ఇది 57వ చిత్రం కావడం విశేషం.
ఈ చిత్ర పోస్టర్‌ రానా తన ట్విట్టర్‌ ఖాతాలో ట్వీట్‌ చేస్తూ అజిత్‌పై ప్రశంసలు కురిపించాడు. 'వావ్‌.. వావ్‌.. వావ్‌.. ఔట్‌స్టాండింగ్‌.. మా అందరికి మీరు స్ఫూర్తి. ఈ పోస్టర్‌ వృత్తి పట్ల మీ అకింతభావాన్ని తెలియజేస్తోంది. మీరు నిజంగా రాక్‌స్టార్‌' అని ట్వీట్‌ చేస్తూ అజిత్‌ పోస్టర్‌ను పోస్ట్‌ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com