ప్రపంచంలోని టాప్-500 విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా నిలిచిన కతార్ విశ్వవిద్యాలయం
- September 15, 2015
క్వాక్యువరెల్లి సైమండ్స్ వల్డ్ యూనివర్సిటీ (QS) ర్యాంకింగ్స్ 2015-16 ప్రకారం, ప్రపంచం లోని 500 అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో కతార్ విశ్వవిద్యాలయం (KU) ఒకటిగా నిలిచింది! QS వారి తాజా ర్యాంకింగ్స్ లో KU, 481-490 శ్రేణిలో నిలిచింది. అక్యాడెమిక్ రెప్యుటేషన్ (40%), ఎంప్లాయర్ రెప్యుటేషన్ (10%), స్టూడెంట్-టూ-ఫ్యాకల్టీ రేషియో (20%), సైటేషన్స్ పర్ ఫ్యాకల్టీ (20%), ఇంటర్‌న్యాషనల్ ఫ్యాకల్టీ రేషియో (5%), మరియు ఇంటర్‌న్యాషనల్ స్టూడెంట్ రేషియో (5%) వంటి ఆరు ప్రదర్శనా సూచికల ఆధారంగా QS వారు తమ 12వ ప్రపంచ ఉత్తమ యూనివర్సిటీల రాంకింగ్ లను నిర్ణయించారు.
పరిశోధనలో, గల్ఫ్ ప్రాంతంలోనే అతివేగంగా అభివృద్ధి చెందుతున్న నేపధ్యంలో కతార్ విశ్వవిద్యాలయానికి ఈ విధమైన గుర్తింపు లభించడం, ఒక ముఖ్యమైన మైలురాయి అని ఇది విద్య మరియు పరిశోధన రంగాలలో అంకితమైన తమకృషికి ఫలితమని, ఉత్తమ ఫలితాలు మరియు మెరుగుపడిన ఉత్తీర్ణ తలకు నిదర్శనమని, అంతర్జాతీయంగా బరిలో నిలవడానికి తమ ఆచార్యులు మరియు విద్యార్ధులు కంకణం కట్టుకుంటామని విశ్వవిద్యాలయం అధ్యక్షులు డా. హస్సన్ అల్-దేర్హ మ్ చెప్పారు. అంతేకాకుండా, హ్యూమనిటీస్, ఇంజినియరింగ్ అండ్ టెక్నాలజీ, లైఫ్ సైన్సస్ అండ్ మెడిసిన్, న్యాచురల్ సైన్సస్ మరియు సోషియల్ సైన్సస్ అండ్ మ్యానేజ్మెంట్ వంటి ఐదు విడివిడి అధ్యాపక సిబ్బంది విభాగాల్లో కూడా కతార్ యూనివర్సిటీ ముందంజలో ఉంది.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,కతార్)
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









