భారతీయ మహిళకు ఘోర పరాభవం బెర్లిన్ విమానాశ్రయంలో...

- February 03, 2017 , by Maagulf
భారతీయ మహిళకు ఘోర పరాభవం బెర్లిన్ విమానాశ్రయంలో...

బెర్లిన్ విమానాశ్రయంలో భారతీయ మహిళకు భరిచలేని అవమానం ఎదురైంది.  గాయత్రీ బోస్ అనే భారత సంతతకి చెందిన మహిళ సింగపూర్ ట్రాన్స్‌పోర్ట్ కంపెనీలో మేనేజర్‌గా పని చేస్తుంది.  ఆమెకు ఇద్దరు పిల్లలు మూడేళ్ళ బాబు, ఏడు నెలల పాప ఉన్నారు.  గత గురువారం పారిస్ వెళ్ళేందుకు బెర్లిన్‌లోని ఫ్రాంక్‌ఫర్డ్ విమానాశ్రయానికి వచ్చారు.  ఆమె లగేజీని ఎక్స్‌రే మిషన్ ద్వారా చెక్ చేస్తున్నారు. అందులో పాపకు ఫీడ్ చేయడానికి ఉపయోగించే పంప్ కనిపించింది.  వెంటనే గాయత్రి పాస్‌పోర్టును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  ఓ మహిళా పోలీస్ అధికారి ఆమెను చెకింగ్ రూమ్‌లోకి తీసుకువెళ్ళి 45 నిమిషాలపాటు విచిత్రమైన ప్రశ్నలతో వేధించారు.  సాటి మహిళ అని కూడా చూడకుండా వివేకాన్ని మరిచి ఫీడ్ పరికరాన్ని ఉపయోగించే విధానాన్ని చూపించమంటూ వేధించింది. మహిళా పోలీస్ అధికారి చెప్పినట్లు చేయక తప్పలేదని, దాదాపు గంట పాటు నరకాన్ని భరించానని గాయత్రి వాపోయింది.  జరిగింది తలుచుకుంటే ఏడుపు ఆగట్లేదంటూ, పరీక్షల అనంతరమే పారిస్ వెళ్ళేందుకు అనుమతిస్తూ పాస్‌పోర్టును తిరిగి ఇచ్చారని గాయత్రి పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com