కువైట్, ఖత్తర్, దుబాయి, అబుదాబిలకు తిరుపతి నుంచి ఏప్రిల్ నుండి విమాన సర్వీసులు..!
- February 03, 2017
తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ అని పేరే కాని, ఇప్పటి వరకు ఒక్క ఇంటర్నేషనల్ సర్వీస్ కూడా ఇక్కడ నుంచి లేదు. అయితే, త్వరలోనే ఈ కల తీరనుంది. తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి, విదేశీ సర్వీసులు నడవనున్నాయి. మొదటగా ఏప్రిల్ నెల నుంచి, గల్ఫ్ దేశాలకు విమాన సర్వీసులు నడవనున్నాయి. రేణిగుంట ఎయిర్‌పోర్టు నుంచి గల్ఫ్ దేశాలైన కువైట్, ఖత్తర్, దుబాయి, అబుదాబి తదితర దేశాలకు ఈ సర్వీసులను నడపనున్నారు. ప్రస్తుతం, తిరుపతి విమానాశ్రయానికి 7 విమానాలు నడుస్తున్నాయి.
గల్ఫ్ దేశాలకు నడపటానికి కారణం, కడప, తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, ఒంగోలు, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి గల్ఫ్ దేశాలకు, ఉపాధి కోసం వేలాదిగా వెళ్తూ ఉంటారు. వీళ్ళు చెన్నై ఎయిర్‌పోర్టు ను ఆశ్రయిస్తూ ఉంటారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాంత ప్రజల సౌలభ్యం దృష్ట్యా ప్రవాస భారతీయుల కోసం గల్ఫ్ దేశాలకు నుంచి సర్వీసులు నడపడానికి నిర్ణయించారు. అలాగే, తిరుమల శ్రీ వారి దర్శనం కోసం, వచ్చే భక్తులకి కూడా, ఈ సర్వీస్ ఉపయోగపడుతుంది. అలాగే, త్వరలోనే, మరిన్ని దేశాలకు, విమానాలు నడుపుతామని, పౌర విమానయాన మంత్రి అశోకగజపతి రాజు వెల్లడించారు.
ప్రస్తుతం ప్రతి రోజు గల్ఫ్ దేశాలకు చెన్నై నుండి సుమారు రోజుకు 1000 మంది వరకు రక పోకలు సాగిస్తున్నారు. ఒక వేల ఈ సర్వీసులు మొదలైతే ఇక్కడి తెలుగు వారికీ చాల సంతోషకరమైన వార్తే అవుతుంది. ఎన్నో సంవత్సరాల నుండి రేణిగుంట కు నేరుగా సర్విసుల కోసం ఎంతో మంది ఎన్నో రకాలుగా విన్నపాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు వారి కళ తీరిన్ట్లవుతుంది. అలాగే ఎంతో సమయము, మరియు డబ్బులు కుడా అదా అవుతుంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







