భారతీయ మహిళకు ఘోర పరాభవం బెర్లిన్ విమానాశ్రయంలో...
- February 03, 2017
బెర్లిన్ విమానాశ్రయంలో భారతీయ మహిళకు భరిచలేని అవమానం ఎదురైంది. గాయత్రీ బోస్ అనే భారత సంతతకి చెందిన మహిళ సింగపూర్ ట్రాన్స్పోర్ట్ కంపెనీలో మేనేజర్‌గా పని చేస్తుంది. ఆమెకు ఇద్దరు పిల్లలు మూడేళ్ళ బాబు, ఏడు నెలల పాప ఉన్నారు. గత గురువారం పారిస్ వెళ్ళేందుకు బెర్లిన్‌లోని ఫ్రాంక్‌ఫర్డ్ విమానాశ్రయానికి వచ్చారు. ఆమె లగేజీని ఎక్స్‌రే మిషన్ ద్వారా చెక్ చేస్తున్నారు. అందులో పాపకు ఫీడ్ చేయడానికి ఉపయోగించే పంప్ కనిపించింది. వెంటనే గాయత్రి పాస్‌పోర్టును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ మహిళా పోలీస్ అధికారి ఆమెను చెకింగ్ రూమ్‌లోకి తీసుకువెళ్ళి 45 నిమిషాలపాటు విచిత్రమైన ప్రశ్నలతో వేధించారు. సాటి మహిళ అని కూడా చూడకుండా వివేకాన్ని మరిచి ఫీడ్ పరికరాన్ని ఉపయోగించే విధానాన్ని చూపించమంటూ వేధించింది. మహిళా పోలీస్ అధికారి చెప్పినట్లు చేయక తప్పలేదని, దాదాపు గంట పాటు నరకాన్ని భరించానని గాయత్రి వాపోయింది. జరిగింది తలుచుకుంటే ఏడుపు ఆగట్లేదంటూ, పరీక్షల అనంతరమే పారిస్ వెళ్ళేందుకు అనుమతిస్తూ పాస్‌పోర్టును తిరిగి ఇచ్చారని గాయత్రి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







