తెలంగాణలో 18 మందికి స్వైన్ ఫ్లూ...
- February 03, 2017
హైదరాబాద్: చలికాలం ముగుస్తున్న స్వైన్ ఫ్లూ మహమ్మారి మాత్రం తెలంగాణా రాష్ట్రాన్ని వీడటం లేదు. తెలంగాణలో 18 మందికి స్వైన్ ఫ్లూ పాజిటివ్ కేసులు తాజాగా వెలుగుచూడటంతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. ఇందులో 13మందికి హెచ్1 ఎన్1 వైరస్ తోపాటు ఇతర వ్యాధులతో బాధపడుతున్నారని వైద్యుల పరీక్షల్లో తేలింది. 85 మంది రోగులను పరీక్షించగా వారిలో 18 మందికి స్వైన్ ఫ్లూ పాజిటివ్ అని తేలిందని వైద్యులు పేర్కొన్నారు.గత సంవత్సరం 3,696 మంది శాంపిల్స్ ను పరీక్షించగా వారిలో 250 మందికి స్వైన్ ఫ్లూ సోకిందని వెల్లడైంది. ఈ వ్యాధిని నయం చేసేందుకు అవసరమైన మందులు, టెస్టింగ్ కిట్స్ అందుబాటులో ఉన్నా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







