హైదరాబాద్‌ నగరంలో నైజీరియన్ యువకులు వీరంగం చేశారు...

- February 03, 2017 , by Maagulf
హైదరాబాద్‌ నగరంలో నైజీరియన్ యువకులు వీరంగం చేశారు...

హైదరాబాద్: నగరంలో నైజీరియన్ యువకులు వీరంగం చేశారు. విధుల్లో ఉన్న పోలీసులపై తమ ప్రతాపం చూపించారు. నగర పోలీసులు పలుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా నగరంలోని జూబ్లీహిల్స్‌ ప్రాంతంలో విధుల్లో ఉన్న పోలీసులతో నైజీరియన్ యువకులు గొడవకు దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో విధుల్లో ఉన్న పోలీసులను నెట్టేశారు. ఈ ఘటనతో నైజీరియన్ యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై న్యూసెన్స్ కేసు నమోదు చేశారు. మొత్తంగా ఈ తనిఖీల్లో పోలీసులు 60 వాహనాలను సీజ్‌ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com