కాటమరాయుడు టీజర్ రిలీజైన 15 గంటల్లోనే 26లక్షల వ్యూస్...

- February 04, 2017 , by Maagulf
కాటమరాయుడు టీజర్ రిలీజైన 15 గంటల్లోనే 26లక్షల వ్యూస్...

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కాటమరాయుడు టీజర్ శనివారం విడుదలైంది. ఈ టీజర్ విడుదలైన కొద్ది గంటల్లోనే అరుదైన రికార్డ్ సృష్టించింది. టీజర్ రిలీజైన 15 గంటల్లోనే 26లక్షల వ్యూస్ సాధించి యూట్యూబ్ ట్రెండింగ్‌లో ప్రస్తుతానికి 1లో నిలిచింది. కాటమరాయుడు టీజర్‌కు ఈ అనూహ్య స్పందన చూసిన ఫ్యాన్స్ పవన్ మరో హిట్ కొట్టడం పక్కా అంటున్నారు. అంతేకాదు, గబ్బర్ సింగ్‌తో పోలికలు పెడుతున్నారు. గబ్బర్‌సింగ్‌ సినిమాతో ఎర్ర కండువా ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాలో పవన్ తన కండువా కలర్ మార్చాడు. కలర్ ఏదైనా కాన్సెప్ట్ మాత్రం జనాలకు నచ్చుతుందని ఫ్యాన్స్ గట్టిగా చెబుతున్నారు.
ఏదేమైనా సర్దార్ గబ్బర్‌సింగ్ లాంటి భారీ ప్లాప్ తర్వాత పవన్ కసితో చేస్తున్న సినిమా ఇది. అంతేకాదు, గబ్బర్ సింగ్ జోడీ మరోసారి కాటమరాయుడు సినిమాలో మరోసారి ఆడిపాడబోతోంది. పవన్, శ్రుతి హాసన్ కాంబినేషన్ కూడా ఈ సినిమాకు కలిసొచ్చే అంశం. పైగా మెగా హీరోలకు ఈ మధ్య రీమేక్ సినిమాలు బాగానే కలిసొచ్చాయి.

చిరంజీవి ఖైదీ నెం.150 సినిమా కత్తి సినిమాకు రీమేక్‌గా విడుదలై కలెక్షన్ల వర్షం కురిపించింది. రామ్‌చరణ్ హీరోగా నటించిన ధృవ సినిమా కూడా తమిళంలోని తనైఒరువన్ సినిమాకు రీమేక్. ఇది కూడా తెలుగులో ఘన విజయం సాధించింది. పవన్ కాటమరాయుడు సినిమా కూడా అజిత్ హీరోగా నటించిన వీరమ్ సినిమాకు రీమేక్.

దీంతో పవన్‌ విషయంలో కూడా ఈ రీమేక్ సెంటిమెంట్ కలొసొస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com