సీనియర్ నటి రాధిక సరికొత్త పాత్రలో...
- February 04, 2017
వెండితెరపై ఎన్నో బోల్డ్, డేరింగ్ పాత్రలు పోషించిన సీనియర్ నటి రాధిక సరికొత్త పాత్రలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆమె ఇంత కు ముందెన్నడూ పోషించనటు వంటి, ఎవరూ ఊహించనటువంటి పాత్ర అది. రాధిక నటిస్తున్న తాజా చిత్రం 'ఇప్పడి వెల్లుమ్'. ఉదయనిధి, మంజిమ మోహన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి గౌరవ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో రాధిక హీరో తల్లిగా, బస్సు డ్రైవర్ పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం చిత్రీ కరణ ప్రారంభించడానికి ముందు బస్సు డ్రైవింగ్ కూడా నేర్చుకున్నారట.
విల్లుపురం నుంచి నిపుణులు ప్రత్యేకంగా చెన్నై కి వచ్చి మరీ రాధికకు బస్సు డ్రైవింగ్ నేర్పించి న ట్టు సమాచారం.
ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే.. చాలా తక్కువ రోజుల్లో రాధిక బస్సు నడపడంలో నైపుణ్యం సంపాదించి అందర్నీ ఆశ్చ ర్యపరిచారట. ఇప్పడు సెట్స్‌లో ఎవరి సహాయం లేకుండానే నిజమైన డ్రైవర్‌గా బస్సు నడిపేస్తున్నారని చెబుతున్నారు. త్వరలో రాబోతున్న అంత ర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాధిక బస్సు శిక్షణ పొందుతున్న వీడియోను విడుదల చేసేందుకు గౌరవ్ బృందం ప్లాన్ చేస్తుందట.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









