యు.ఏ.ఈ లో అంగరంగ వైభవంగా 'శ్రీ వెంకటేశ్వరస్వామి కళ్యాణం'
- February 05, 2017




కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. అజ్మాన్లోని ఇండియన్ అసోసియేషన్ హాల్ ఈ ఉత్సవానికి వేదికయ్యింది. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సుమారు 9 వేల మందితో ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఓం నమో వెంకటేశాయ నినాదాలతో మార్మోగిపోయింది. ఈ సందర్భంగా కల్చరల్ ప్రోగ్రామ్స్‌ని ఏర్పాటు చేశారు. ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ మరియు నృత్యాలు ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుకకి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ కాపు వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ చలమలశెట్టి రామానుజయ హాజరయ్యారు. విదేశాల్లో, ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో వెంకటేశ్వరస్వామి కళ్యాణానికి ఇంత పెద్దయెత్తున భక్తులు హాజరవడం, ఇంత అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరగడం గొప్ప విషయం. 'సంప్రదాయం' సభ్యులు సుదర్శన్,ధర్మ రాజు,కుమార్,శ్రీనివాస్,వెంకట్ వారి ఆధ్వర్యంలో ఈ వేడుక అద్భుతంగా జరిగింది.ఈ కార్యక్రమంలో కె.లక్ష్మీపతి, శ్రీకాంత్ చిత్తర్వు, ముక్కు తులసి కుమార్, ఇరికి తులసి ప్రసాద్,సింగిరి రవికుమార్,అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.











తాజా వార్తలు
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!







