చిరుపై కె.విశ్వనాథ్ ప్రశంసల వర్షం...
- February 06, 2017
ప్రశస్తమైన సినిమాలను సృష్టించి, తెలుగు సినిమాకు ఒక గౌరవాన్ని, గుర్తింపును తెచ్చిన డైరెక్టర్ కళాతపస్వి కె.విశ్వనాథ్. శంకరాభరణం , ఆపద్భాందవుడు, స్వాతిముత్యం, స్వర్ణకమలం, సాగరసంగమం, స్వయంకృషి ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో అవార్డ్స్ సినిమాలు తెరకెక్కించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు కె.విశ్వనాథ్..అలాంటి గొప్ప వ్యక్తి , నటుడు & డైరెక్టర్ తాజాగా మెగా స్టార్ చిరంజీవి నటించిన ఖైదీ నెం 150 ఫై ప్రశంసలు కురిపించాడు.
ఆదివారం రాత్రి ఖైదీ..
స్పెషల్ షోను చిత్ర దర్శకుడు వి.వి.వినాయక్‌తో కలిసి వీక్షించారు. అనంతరం చిరుపై కె.విశ్వనాథ్ ప్రశంసల వర్షం కురిపించారు. సినిమా చాలా బావుంది. ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత కూడా చిరు ఎనర్జీలో కానీ, గ్రేస్‌లో కానీ ఏ మాత్రం తేడా రాలేదు. అదే ఎనర్జీ ఆయన అభినయంలో కూడా కనిపించింది.. సినిమా బాగా ఎంజాయ్ చేశాన"ని కె.విశ్వనాథ్ అన్నారు. చిరంజీవి ఇకమీదటా నటనలో కొనసాగాలి. మరిన్ని మంచి సినిమాల్ని తెలుగు ప్రేక్షకులకు అందించాలని ఆకాంక్షించారు.
చిరంజీవి - విశ్వనాధ్ కాంబినేషన్ లో 'శుభలేఖ', 'ఆపద్బాంధవుడు', 'స్వయం కృషి' వంటి చిత్రాలు వచ్చి అభిమానులను అలరించాయి.
తాజా వార్తలు
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్‌పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..









