అమెరికా ఎయిర్ పోర్టుల్లో భావోద్వేగ దృశ్యాలు.. తమవాళ్లను కలుసుకున్నారు..
- February 06, 2017
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏడు ముస్లిం దేశాలపై విధించిన ట్రావెల్ బ్యాన్‌తో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆయా నిషేధిత దేశాల నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడ్డ ముస్లింల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది.
మరీ ముఖ్యంగా.. వాళ్లలో అమెరికా నుంచి బయటకెళ్లిన ముస్లింలు.. తిరిగి అమెరికాలో అడుగుపెట్టగలరా? అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇలాంటి తరుణంలో సియాటెల్ ఫెడరల్ కోర్టు పుణ్యమాని.. బయట దేశాలకు వెళ్లిన ముస్లింలంతా తిరిగి అమెరికా చేరుకుంటున్నారు.
దీంతో అమెరికా ఎయిర్ పోర్టుల్లో ఎక్కడ చూసినా.. భావోద్వేగ దృశ్యాలే కనిపిస్తున్నాయి. భర్తలను కలుసుకున్న భార్యలు.. తల్లిదండ్రులను కలుసుకున్న పిల్లలు..
ఇలా తమవారు తిరిగి అమెరికా చేరడంతో నిరాశలో నిస్సహాయులుగా మిగిలిపోయినవారికి కొత్త ఊపిరి పడ్డట్టయింది.
కాగా, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేసి ట్రంప్ ఏడు ముస్లిం దేశాలపై నిషేధం విధించగా.. దానిపై సియాటెల్ ఫెడరల్ కోర్టు 'స్టే' విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయా దేశాలకు వెళ్లిన అమెరికన్ ముస్లింలు తిరిగి అమెరికా చేరుకుంటున్నారు. తమవారిని కలుసుకున్న ఆనందంలో కంటతడి పెడుతున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







