'షో టైమ్' పాటలు విడుదల
- February 06, 2017
రమా రీల్స్ పతాకంపై రణధీర్, రుక్సార్ నటీనటులుగా ఎస్.ఎస్.కాంచీ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ''షో టైమ్''. జాన్ సుధీర్ పూదోట నిర్మాత. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించారు. ఇటీవల హైదరాబాద్‌లో పాటల్ని విడుదల చేశారు. ఎస్.ఎస్.రాజమౌళి ప్రచార చిత్రాల్ని ఆవిష్కరించారు. అనుష్క తొలి సీడీని ఆవిష్కరించారు. రచయిత శివశక్తిదత్తా స్వీకరించారు. రాజమౌళి మాట్లాడుతూ ''కాంచీ ప్రతి మాటలో వెటకారం ఉంటుంది. ప్రతి ఒక్కరిలో తప్పులు చూపిస్తుంటారు. ఆయన దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తప్పులుండకూడదని ఆశిస్తున్నా'' అని అన్నారు. కాంచీ మాట్లాడుతూ '' నేనెప్పుడో డైరెక్షన్ చెయ్యాలి. ఆలస్యమైన మాట నిజమే..
సినిమాని బాగా తియ్యగలననే నమ్మకంతో ముందడుగు వేశా. తప్పులు వెదక్కుండా ఉండాలని జాగ్రత్తగా సినిమా తీశా'' అని అన్నారు. ''ఐటమ్ సాంగ్, ఫైట్లు లేకుండా అందరూ ఆస్వాదించేలా సినిమా తీశాడు కాంచీ. అందరూ మాట్లాడుకునే భాషలో హాయిగొలిపే పాటలు ఇందులో ఉన్నాయి'' అని కీరవాణి చెప్పారు. చక్కని పాటలు కుదిరాయనీ, ఈ నెలలో సినిమాను విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. ఓ థియేటర్‌లో సాగే కథ ఇదని కె.రాఘవేంద్రరావు చెప్పారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







