పెరిగిన పసిడి, వెండి ధరలు
- February 07, 2017
వరుసగా రెండో రోజు బంగారం ధర పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో పాటు స్థానిక నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు పెరగడంతో పసిడి ధర 10 గ్రాములకు రూ.200 పెరిగి రూ.29,850కి చేరింది. ఇదే బాటలో వెండి ధర కూడా పెరిగింది. కేజీ వెండి ధర రూ.350 పెరిగి రూ.42,800కి చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి వెండికి డిమాండ్ పెరిగినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. అలాగే అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం, వెండి ధరలు పెరిగాయి. న్యూయార్క్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1.29శాతం పెరిగి 1,235.20 డాలర్లకు చేరగా, ఔన్సు వెండి ధర 1.26శాతం పెరిగి 17.71డాలర్లుగా ఉంది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







