అమెరికాలో 'జీ తెలుగు సినిమాలు'
- February 07, 2017
అమెరికాలో పెద్ద సంఖ్యలో ఉన్న తెలుగు వీక్షకులను ఆకట్టుకునేందుకు ప్రముఖ మీడియా సంస్థ జీ చానెల్ ముందడుగేసింది. 'జీ తెలుగు సినిమాలు' చానెల్‌ను ప్రారంభించింది. తెలుగు ప్రజల జీవితంలో సినిమాలు ముఖ్యమైన భాగంగా ఉన్నాయి. అంతేకాదు, సినీ ప్రముఖులను వారు ఎంతగానో ఆరాధిస్తారు..ఈ కారణంగానే తాము తెలుగు ప్రజల అభిమాన జీ టీవీ తెలుగు సినిమాలు చానెల్‌ను ప్రారంభిస్తున్నామని జీ అమెరికా బిజినెస్ హెడ్ సమీర్ టార్గే అన్నారు. కొత్త చానెల్‌ను డిష్, స్లింగ్ టీవీల్లో చూడవచ్చని తెలిపారు. బ్రహ్మోత్సం, కుమారి 21ఎఫ్, అఆ, సుప్రీం వంటి హిట్ సినిమాలను తాము తెలుగు వారికోసం అందించనున్నామన్నారు. జీ తెలుగు సినిమాలు ఆరంభంతో అమెరికా వాసులకు అందుబాటులో ఉండే జీ టీవీ చానెల్స్ సంఖ్య 37కు చేరుకుంది.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







