కాబూల్‌ సుప్రీంకోర్టు వద్ద భారీ పేలుడు, 12 మంది మృతి

- February 07, 2017 , by Maagulf
కాబూల్‌ సుప్రీంకోర్టు వద్ద భారీ పేలుడు, 12 మంది మృతి

ఆఫ్గనిస్థాన్‌ రాజధాని కాబూల్‌లోని సుప్రీంకోర్టు భవనం సమీపంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 12 మంది దుర్మరణం పాలయ్యారు. పదుల సంఖ్యలో గాయపడినట్టు ఆప్గాన్ మీడియా పేర్కొంది. వెంటనే భద్రతా బలగాలు రంగంలోకి దిగి ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఇది ఆత్మాహుతి దాడేనని భద్రతా దళాలు భావిస్తున్నాయి. ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com