స్టార్ హీరో తో జోడీ కట్టేఛాన్స్ ను దక్కించుకొన్న వర్మ...
- February 08, 2017
వర్మ వివాదాలకు నెలవైతే.. మనం చెప్పుకొనే వర్మ పెళ్లి చూపుల సినిమాతో అందరినీ ఆకట్టుకొన్న రీతూ వర్మ. పెళ్లి చూపుల ముద్దు గుమ్మ రీతూ వర్మ బంపర్ ఆఫర్ కొట్టేసింది.. స్టార్ హీరో తో జోడీ కట్టేఛాన్స్ ను దక్కించుకొన్నది.. కాగా ఆ ఛాన్స్ తమిళ మూవీలో.. తమిళ స్టార్ హీరో విక్రమ్ తో జోడీ గా నటించే ఆఫర్ ను దక్కించుకొన్నది.. వివరాల్లోకి వెళ్తే...
గౌతమ్ మీనన్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా "ధృవ నచ్చత్తిరం" అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి విధితమే.. ఇప్పటికే షూటింగ్ జరుపుకొంటున్న ఈ సినిమాలో మొదట విక్రమ్ తో హీరోయిన్ గా నటించే అవకాశం అనూ ఇమ్మాన్యుయెల్ దక్కించుకొన్నది.. కానీ డేట్స్ అడ్జెస్ట్ కాక సినిమానుంచి తప్పుకొన్నది.. దీంతో ఆ అవకాశం పెళ్లి చూపులు హీరోయిన్ రీతూ వర్మ కు దక్కింది.. ఇప్పటికే షూటింగ్ కు కూడా హాజరవుతున్నది.. మరి విక్రమ్ తర్వత మరిన్ని పెద్ద సినిమాల్లో అవకాశాలు వస్తాయని రీతూ వర్మ ఆశపడుతుంది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









