సానియా మీర్జాకు సమన్లు జారీ చేసిన సేవా పన్ను అధికారులు

- February 08, 2017 , by Maagulf
సానియా మీర్జాకు సమన్లు జారీ చేసిన సేవా పన్ను అధికారులు

ప్రముఖ టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జాకు సేవా పన్ను అధికారులు సమన్లు జారీ చేశారు. సేవా పన్నులు చెల్లింపులు సక్రమంగా లేనందున విచారణ నిమిత్తం ఈ నెల 16న స్వయంగా సానియా మీర్జాకాని, ఆమె ప్రతినిధి కాని తమ ఎదుట హాజరు కావాలని సేవా పన్ను అధికారి సురేష్‌కుమార్‌ ఆదేశించారు. రెడ్‌హిల్స్‌లోని సేవా పన్ను విభాగం అధికారులు ఈ నెల 6వ తేదీన ఆమెకు సమన్లు జారీ చేశారు. జూబ్లీహిల్స్‌లో నివాసం ఉంటున్న సానియా మీర్జాకు వీటిని అందచేశారు. 1994 ఆర్థిక చట్టం ప్రకారం తాము జారీ చేసిన సమన్లకు స్పందించి తగిన పత్రాలు ఇవ్వనట్లయితే చట్ట ప్రకారం తాము తీసుకునే చర్యలకు బాధ్యులవుతారని స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com