యూ. ఏ. ఈ. లో తీవ్రమైన పొగమంచు - 50 మీ. కు తగ్గిన దృగ్గోచరత
- September 17, 2015
దేశమంతటా తీవ్రమైన పొగమంచు తో కూడిన వాతావరణం ఏర్పడి, యూ. ఏ. ఈ. లో ని కొన్ని ప్రదేశాలలో దృగ్గోచరత 50 మీటర్లకు పడిపోవడం వల్ల దేశ వాతావరణ శాఖ వారు ముందుజాగ్రత్త హెచ్చరికను జారీచేశారు. నేషనల్ సెంటర్ ఫర్ మెటీయరాలజీ అండ్ సెస్‌మాలజీ వారు, (NCMS) దేశంలోని కోస్తా మరియు అంతర్గత ప్రాంతాలలో, దేశ పశ్చిమ ప్రాంతమైన మదినాత్ జాయెద్, లివా మరియు అబుధాబీ లోని మరికొన్ని ప్రాంతాలలో నేడు దట్టమైన పొగమంచు వ్యాప్తించి ఉంటుందని హెచ్చరికలు జారీచేశారు.
దేశ తూర్పు ప్రాంతం లో ఆస్థిరమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం రాస్-అల్-ఖైమా, ఫ్యుజారీయా లలో వర్షంపాతం అధిక నమోదై, వాడీలు పొంగిపొర్లాయి. గడచిన 24 గంటల్లో ఈ ప్రాంతాలు విస్తారమైన వర్షపాతాన్ని చవి చూశాయని, NCMS వారు కూడా ధృవీకరించారు; ఇంకా నేడు కూడా ఆకాశం దట్టమైన మేఘావృతమై, భారీ వర్షాలు పడతాయని సూచన జారీ చేశారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







