నేడు ప్రధాని నరేంద్ర మోడీ బర్త్ డే.. 'ఒకే ఒక్కరికి' మాత్రమే అనుమతి.. ఆయనెవరో..?
- September 17, 2015
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం తన 66వ పడిలోకి అడుగుపెట్టారు. గతేడాది ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తన తొలి జన్మదినాన్ని అహ్మదాబాద్‌లోని తన తల్లి హీరాబెన్‌తో కలిసి సాదాసీదాగా జరుపుకున్నారు. ఈ ఏడాది కూడా తన జన్మదినం సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించవద్దని బీజేపీ కార్యకర్తలకు, దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇక జన్మదినం సందర్భంగా ఎలాంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించుకోని మోడీ, యథావిధిగా రోజువారీ అధికారిక కార్యక్రమాలకు హాజరు కానున్నారు. అయితే, తన పుట్టినరోజున తన అధికారిక నివాసంలో ఒక్కరిని మాత్రమే మోడీ ఆహ్వానించారు. మిగిలిన ఏ ఒక్కరికి కూడా అపాయింట్ ఇవ్వలేదు. ఆ 'ఒకే ఒక్కరు' ఎవరనే ఆసక్తి నెలకొంది. భద్రతా కారణాల రీత్యా సదరు వ్యక్తి పేరు, ఇతర వివరాలను వెల్లడించేందుకు నిరాకరించిన ప్రధానమంత్రి కార్యాలయం నిరాకరించింది. ఈ ఒక్క వ్యక్తిని మోడీ ఆహ్వానించడానికి ప్రత్యేకమైన కారణం లేకపోలేదు. అది 2000 సంవత్సరం. బీజేపీ ప్రధాన కార్యదర్శిగా మోడీ ఉన్నారు. ప్రధాన కార్యదర్శి హోదాలో ఢిల్లీ, అశోకా రోడ్డులోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఓ చిన్న గదిలో ఉండే మోడీ కూర్చొనివుండే మోడీని.. ఏ ఒక్కరూ పట్టించుకునేవారే కాదట. ఆ యేడాది ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని అక్కడ పనిచేసే ఓ వ్యక్తి మోడీ వద్దకు వచ్చి, బర్త్ డే గ్రీటింగ్స్ చెప్పి నోరు తీపి చేశాడట. అయితే ఆ వ్యక్తికి ఇచ్చేందుకు మోడీ వద్ద కేవలం రూ.2 ఉన్నాయట. దీంతో "నా వద్ద రెండు రూపాయలే ఉన్నాయి. ఏం కొనివ్వమంటావు?" అని మోడీ ఆ వ్యక్తిని అడిగారు. "రాబోయే రోజుల్లో మీరు ఇంకా పెద్ద పదవిలోకి వెళతారు. అప్పుడు నన్ను గుర్తుపెట్టుకోండి చాలు. నాకేమీ ఇవ్వొద్దు"అని బదులిచ్చాడట. ఆ మరుసటి యేడాదే గుజరాత్ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. దీంతో ముఖ్యమంత్రి కేశూభాయ్ పటేల్‌ను తప్పించి.. సీఎంగా నరేంద్ర మోడీని ఎంపిక చేసింది బీజేపీ అధిష్టానం. ఆ మరుసటి ఏడాది (2002)లో మోడీ తన జన్మదినం సందర్భంగా ఆ వ్యక్తిని గుర్తుపెట్టుకుని తన ఇంటికి పిలిపించుకుని అతడితో కలిసి భోజనం చేశారట. అప్పటి నుంచి ఏటా ఆ వ్యక్తిని మోడీ తన జన్మదినం రోజున కలుస్తూనే ఉన్నారు. ఈ ఏడాది కూడా ఆ ఒక్క వ్యక్తికి మాత్రమే ప్రధాని అధికారిక నివాసంలోకి ప్రవేశాన్ని మోడీ కల్పించారు.
ప్రధాని నరేంద్ర మోడీ గారికి మాగుల్ఫ్.కాం వారి జన్మదిన శుభాకాంక్షలు..!!
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







