'బిచ్చగాడు' హీరోయిన్ సట్నా టైటస్ మళ్లీ మ్యారేజ్ చేసుకుంది...

- February 09, 2017 , by Maagulf
'బిచ్చగాడు' హీరోయిన్ సట్నా టైటస్ మళ్లీ మ్యారేజ్ చేసుకుంది...

'బిచ్చగాడు' హీరోయిన్ సట్నా టైటస్ మళ్లీ మ్యారేజ్ చేసుకుంది. కాసింత విచిత్రంగా వుంది.. ఇంతకీ ఈసారి మ్యారేజ్ ఎవరితో అన్న డౌట్ వచ్చే వుంటుంది కదూ! అక్కడికే వచ్చేద్దాం.. బిచ్చగాడుతో గ్లామర్ ఇండస్ర్టీలో పాపులర్ అయ్యింది సట్నా. అందులో ఆమె యాక్టింగ్‌కు ప్రశంసలు వచ్చాయి. అయితే ఈ అమ్మడు తాజాగా రెండోసారి మ్యారేజ్ చేసుకుంది.
బిచ్చగాడు ఫిల్మ్‌ని తమిళనాట విడుదల చేసిన డిస్ట్రిబ్యూటర్ కార్తీక్‌ని.. గతేడాది సట్నాని సెప్టెంబర్‌లో సీక్రెట్‌గా పెళ్ళి చేసుకుంది. పేరెంట్స్ పర్మీషన్ లేకుండా రహస్య వివాహం చేసుకున్నారు. ఎలాగోలా ఈ జంట కుటుంబ పెద్దలను ఒప్పించి ఐదునెలల తర్వాత మరోసారి పెళ్లి చేసుకున్నారు.
చెన్నైలో జరిగిన ఈ పెళ్ళి వేడుకకు ఫ్యామిలీ, క్లోజ్‌ఫ్రెండ్స్, సెలబ్రిటీలు హాజరయ్యారు. సట్నా చేతిలో నాలుగైదు ప్రాజెక్టులు వుండగా, కార్తీక్ కొన్ని సినిమాలకు సహనిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com