నాటో ప్రయోగించిన డ్రోన్ దాడిలో 11 మంది ఉగ్రవాదులు హతులయ్యారు...

- February 09, 2017 , by Maagulf
నాటో ప్రయోగించిన డ్రోన్ దాడిలో 11 మంది ఉగ్రవాదులు హతులయ్యారు...

కాబూల్ : ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు ఎదురు దెబ్బ తగిలింది. తూర్పు నన్గర్హర్ ప్రావిన్స్‌లో బుధవారం నాటో ప్రయోగించిన డ్రోన్ దాడిలో 11 మంది ఉగ్రవాదులు హతులయ్యారని, వీరిలో ఇద్దరు సీనియర్ కమాండర్లు ఒమర్ సాదిక్, ఒమర్ ఫారూఖ్ ఉన్నారని ఆఫ్ఘన్ ప్రొవిన్షియల్ పోలీస్ చీఫ్‌కు అధికార ప్రతినిధి మహ్మద్ హుస్సేన్ మష్రాకివాల్ ప్రకటించారు. అమెరికా నేవీ కెప్టెన్ బిల్ సాల్విన్ దాడులు జరిగినట్లు ధ్రువీకరించారు, కానీ వివరాలను వెల్లడించలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com