ఖతార్‌లో ట్రాఫిక్ సంబంధిత మరణాలు తగ్గుముఖం
- February 09, 2017
మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ - జనరల& డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ వెల్లడించిన వివరాల ప్రకారం ట్రాఫిక్ సంబంధిత మరణాలు ఖతార్‌లో గణనీయంగా తగ్గినట్లు తేలింది. 2015తో పోల్చితే 2016లో ఈ తగ్గుదల 21.6 శాతంగా నమోదయ్యింది. 2015లో మొత్తం 227 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఖ్య 2016లో 178గా నమోదైంది. ఇందులో 94.9 శాతం మంది పురుషులు. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ మొహమ్మద్ సాద్ అల్ ఖర్జి మాట్లాడుతూ, ట్రాపిక్ రూల్స్‌ని అమలు చేయడంలో తమ శాఖ ప్రదర్శిస్తున్న శ్రద్ధ, అలాగే వాహనదారుల్లో పెరుగుతున్న అవగాహనే రోడ్డు ప్రమాదాల తగ్గుదలకు కారణమన్నారు. 2016లో జరిగిన 97.5 శాతం ప్రమాదాల్లో మరణాలు చోటు చేసుకోలదన్నారాయన. అతి వేగం కారణంగా 12 మంది ప్రాణాలు కోల్పోగా, రాంగ్ ఓవర్‌టేకింగ్ ముగ్గురి మరణానికి కారణమయ్యింది. డిసిప్లిన్ లేని డ్రైవింగ్ 14 మందిని బలి తీసుకుంది. ఓవర్ టర్నింగ్ వెహికిల్స్ 12.1 శాతం మేజర్ యాక్సిడెంట్లకు కారణమయ్యాయి.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







