'16 ఎవ్వెరీ డీటెయిల్ కౌంట్స్'
- February 09, 2017
- తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ సంస్థ నుంచి మరో సినిమా రాబోతుంది. తమిళంలో విజయవంతమైన 'ధురువంగల్ పదినారు' (డి-16) చిత్రాన్ని తెలుగులో '16 ఎవ్వెరీ డీటెయిల్ కౌంట్స్' పేరుతో విడుదల చేయనున్నారు. రెహ్మాన్ హీరోగా నటించిన ఈ చిత్రానికి కార్తీక్ నరేన్ దర్శకత్వం వహించారు. హేమచంద్ర ఈ చిత్రంలో హీరో పాత్రకు డబ్బింగ్ చెప్పారు. ఇటీవల విడుదలైన ఫస్ట్‌లుక్‌కి మంచి స్పందన వచ్చింది. మార్చి తొలివారంలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
నిర్మాత చదలవాడ పద్మావతి మాట్లాడుతూ ''ఇప్పటికే డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. మార్చి తొలివారంలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం.
హాలీవుడ్ స్థాయిలో ఉత్కంఠభరితంగా తెరకెక్కిన థ్రిల్లర్‌కి తమిళనాట విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అక్కడ ఇప్పటికీ చక్కని వసూళ్లతో దూసుకెళుతోంది. వాస్తవానికి ఈ సినిమాని టాలీవుడ్‌కి చెందిన పలువురు ప్రముఖ నిర్మాతలు, హీరోలు నేరుగా తెలుగులో రీమేక్ చేసే ఉద్దేశంతో భారీ మొత్తాల్ని వెచ్చించి చేజిక్కించుకున్నాం. అందుకు ఆలస్యం కావడంతో డబ్ చేస్తున్నాం' అని అన్నారు.
ఈ చిత్రానికి కెమెరా:సుజిత్ సరంగ్, సంగీతం: జాకేష్ బిజోరు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







