షిర్డీ సాయిబాబాకు రూ.28లక్షల బంగారు కిరీటం బహుకరించిన ఇటలీ మహిళ..
- February 10, 2017
షిర్డీ సాయిబాబాకు ఇటలీ దేశానికి చెందిన ఓ మహిళ రూ.28లక్షల బంగారు కిరీటాన్ని బహుకరించారు. శీలిని డోలోరాస్ అలియాస్ సాయి దుర్గా అనే 72 ఏళ్ల ఇటాలియన్ మహిళా భక్తురాలు 855 గ్రాముల బరువు ఉన్న రత్నాలు పొదిగిన బంగారు కిరీటాన్ని సాయిబాబా సంస్థాన్ ట్రస్టుకు బహుకరించారు. సాయిబాబా భక్తురాలైన ఇటలీ మహిళ గత 9 ఏళ్లుగా ప్రతీనెలా షిర్డీని సందర్శిస్తుంటారు. గతంలో ఈమె బంగారంతో తయారు చేసిన రుద్రాక్ష మాలను రూ.25లక్షలతో చేయించి ఇచ్చారు. తమ ఇటలీ దేశంలో సాయిబాబా దేవాలయాన్ని నిర్మిస్తున్నట్లు శీలిని డోలోరాస్ వెల్లడించారు. తమ దేశంలో నిర్మిస్తున్న దేవాలయంలో ప్రతిష్ఠించేందుకు సిద్ధం చేసిన సాయి ప్రతిమను షిర్డీ సాయి సన్నిధిలో పెట్టి ఆయన ఆశీస్సులు తీసుకున్నానని ఇటలీలోని సాయి భక్తురాలు వివరించారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







