టీమిండియా అరుదైన రికార్డు..
- February 10, 2017
బంగ్లాదేశ్‌తో ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న టెస్టులో భారత క్రికెట్ జట్టు అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. రెండు రోజైన శుక్రవారం టీమిండియా స్కోరు 600 పరుగులకు చేరగానే ఈ ఘనత సాధించింది. టెస్టు క్రికెట్ చరిత్రలో వరుస మ్యాచ్‌ల్లో 600, అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన ఏకైక జట్టుగా టీమిండియా రికార్డు సాధిచింది. భారత్ ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో ఆ జట్టుపై రెండు సార్లు, ప్రస్తుతం హైదరాబాద్‌లో బంగ్లాపై ఒకసారి 600 అంతకంటే ఎక్కువ పరుగులు చేసింది. భారత్ తర్వాత.. ఆస్ట్రేలియా 1946లో ఇంగ్లండ్‌పై రెండు సార్లు, వెస్టిండీస్ 1948లో భారత్‌పై రెండు సార్లు, భారత్ 2009లో శ్రీలంకపై రెండు సార్లు ఇలా వరుస మ్యాచ్‌ల్లో 600+ పరుగులు చేశాయి.
టీ విరామం సమయానికి భారత్ ఆరు వికెట్ల నష్టానికి 620 పరుగులు చేసింది. సాహా 83, జడేజా 16 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. స్కోరు వివరాలు భారత్ మొదటి ఇన్నింగ్స్: రాహుల్ 2, విజయ్ 108, పుజారా 83, కోహ్లీ 204, రహానే 82, అశ్విన్ 34 పరుగులు చేసి అవుటయ్యారు. బంగ్లా బౌలింగ్: తైజుల్ ఇస్లాం 3, మెహదీ హసన్ 2, తస్కిన్ అహ్మద్ ఒక వికెట్ తీశారు.
తాజా వార్తలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్‌లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!
- యూఏఈ అధ్యక్షుడికి అదిరిపోయే గిఫ్టులు ఇచ్చిన భారత ప్రధాని..!!
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి







