అబుధాబి లో సవరించిన పార్కింగ్ ఉల్లంఘనల నిబంధనలు అమలులోకి

- February 11, 2017 , by Maagulf
అబుధాబి లో సవరించిన పార్కింగ్ ఉల్లంఘనల నిబంధనలు అమలులోకి

అబుధాబి: ఉత్తమ సేవలను అందించేలా, టిక్కెట్లు ఖర్చులలో రాయితీలు మెరుగు పర్చే ప్రణాళికలో భాగంగా నూతన మార్పులు చేయబడిన సేవలను పార్కింగ్ డివిజన్ (మరకీఫ్)పార్కింగ్ ఉల్లంఘన నిబంధనలను మున్సిపల్ వ్యవహారాలు మరియు రవాణా శాఖ, ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ సెంటర్  ప్రకటించింది.మరకీఫ్ డైరెక్టర్ మహమ్మద్ హమద్ అల్ ముహారి మాట్లాడుతూ, సవరించిన విధానం ప్రకారం నివాస ప్రాంతాలలో అక్రమ పార్కింగ్ చేయబడితే, గతంలో వసూలు చేసిన 500 ఏ ఈ డి కంటే తక్కువగా 200  ఏ ఈ డి టిక్కెట్ల జారీలో వసూలు చేస్తారని పేర్కొన్నారు, అలాగే టికెట్ జారీ కాబడిన 4 గంటల తర్వాత    ఆయా కార్లను లాక్కుని వెళ్తారని ఆయన తెలిపారు, బస్సులు మరియు టాక్సీ పార్కింగ్ స్థానాలలో అక్రమ పార్కింగ్ చేసినట్లయితే ,500  ఏ ఈ డి ల నుంచి 1000  ఏ ఈ డి లుగా పెంచారు. ఒక టికెట్ ఉపయోగించి, రెండు పార్కింగ్ స్థలాలను కనుక ఆక్రమించే వారికి 300 ఏ ఈ డి నుంచి 200  ఏ ఈ డి కు తగ్గిందబడింది. పార్కింగ్ ప్రాంతానికి పేర్కొనబడని ప్రాంతంలో అనుమతి 100 ఏ ఈ డి ల నుంచి  200 ఏ ఈ డి వరకు పెంచబడింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com