మాటీవి' మార్పులు: లోగో మారింది, ఉద్యోగస్తుల పరిస్దితి ఏంటి...

- February 12, 2017 , by Maagulf
మాటీవి' మార్పులు: లోగో మారింది, ఉద్యోగస్తుల పరిస్దితి ఏంటి...

హైదరాబాద్‌: మాటీవీ తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్‌ చానెల్స్‌ రీసెంట్ గా స్టార్‌ టీవీ నెట్‌వర్క్‌లో భాగం అయ్యాయి. ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌, సినీ రంగ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున యజమానులుగా ఉన్న మా టెలివిజన్‌ నెట్‌వర్క్‌ లిమిటెడ్‌కు చెందిన బ్రాడ్‌కాస్టింగ్‌ వ్యాపారాన్నీ, బ్రాండ్‌, అసెట్స్‌తో సహా స్టార్‌ టీవీ ఏకమొత్తంగా కొనుగోలు చేసింది. దాంతో మాటీవి లోగో మారింది.
స్టార్ తో కలిసి కొత్త బ్రాండ్ లోగోతో ఇక కనపడుతోంది. ఈ లోగోని చిరంజీవి హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. అనంతరం తాను వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'మీలో ఎవరు కోటీశ్వరుడు' కార్యక్రమానికి సంబంధించిన విషయాలను చిరంజీవి మీడియాతో పంచుకున్నారు.
మా టెలివిజన్‌ నెట్‌వర్క్‌కు చెందిన నాలుగు చానళ్లు.... మాటీవీ, మా మ్యూజిక్‌, మా మూవీస్‌, మా గోల్ట్‌ను స్టార్‌ టీవీ గ్రూప్‌ సొంతం చేసుకుంటుంది. మా టెలివిజన్‌ నెట్‌వర్క్‌ లిమిటెడ్‌ కంపెనీ మాత్రం ప్రమోటర్ల చేతుల్లోనే ఉంటుంది.
మా టెలివిజన్‌ నెట్‌వర్క్‌లో నిమ్మగడ్డ ప్రసాద్‌కు 65 శాతం వాటా ఉండగా చిరంజీవి కుటుంబానికి 20 శాతం, అక్కినేని నాగార్జునకు 10 శాతం, రిటైల్‌ ఇన్వెస్టర్ల చేతుల్లో 5 శాతం వాటాలు ఉన్నాయి. కంపెనీ తన వ్యాపారాన్ని విక్రయిస్తున్నందున ఈ డీల్‌కు సంబంధించిన మొత్తం సొమ్ము మా టీవీ నెట్‌వర్క్‌ కంపెనీ ఖాతాల్లోకి వెళుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com