ఇరాక్‌లో అల్లర్లు...

- February 12, 2017 , by Maagulf
ఇరాక్‌లో అల్లర్లు...

- పోలీస్‌ అధికారి మృతి, ఏడుగురికి గాయాలు 
బాగ్దాద్‌ : షీయా మత గురువు మద్దతుదారులు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్ణణలో ఓ పోలీస్‌ అధికారి మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. బాగ్దాద్‌ సెక్యూరిటీ ఆపరేషన్‌ కమాండ్‌ వెల్లడించిన వివరాల ప్రకారం...ఇరాక్‌ ఎన్నికల కమిషన్‌లో సంస్కరణలు చేపట్టాలని షియా మత గురువు ముఖ్తదా అల్‌సద్ర్‌ పిలుపునిచ్చారు. సంస్కరణలు చేప ట్టకపోవడంతోనే ఎన్నికల్లో అవినీతి అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపించారు. ఈనేపథ్యంలో ఆయన మద్దతుదారులు బాగ్దాద్‌ వీధుల్లో ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, విదేశీ దౌత్య కార్యాలయాలుండే గ్రీన్‌జోన్‌కు చేరుకోగానే నిరసనకారులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు.
ఈ ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. నిరసనకారులపై భాష్పవాయుగోళాలు ప్రదర్శించారు. పోలీసులు, నిరసన కారులకు మధ్య చోటుచేసుకున్న ఘర్షణ వాతావరణంలో ఓ పోలీస్‌ అధికారి మృతి చెందగా, మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇరాక్‌ ప్రధాని హైదర్‌ అల్‌-అబాదీ మానవ హక్కులను ఉల్లంఘించా రని అల్‌సద్ర్‌ ఆరోపించారు.

పోలీసులు, భద్రతా బలగాలు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించిన పౌరులపై జులుం ప్రదర్శించాయని అన్నారు. ఈ ఘట నపై తక్షణమే న్యాయ విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. కాగా, శాంతియుతంగా సమావేశం నిర్వహించుకునే హక్కు దేశ పౌరులందరికీ ఉం టుందని ఐరాస సహాయ బృందం పేర్కొంది. శాంతిర్యాలీలో ప్రవేశించి అల్ల ర్లు సృష్టించడమే కాకుండా, ఓ పోలీస్‌ అధికారి మృతికి కారకులైన ఆందోళన కారులను గుర్తించి తక్షణమే అరెస్ట్‌ చేయాలని ఇరాక్‌ ప్రభుత్వాన్ని కోరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com