"నా పేరు సూర్య... నా ఇల్లు ఇండియా" అంటోన్న బన్న...

- February 13, 2017 , by Maagulf

అల్లు అర్జున్ వరస సినిమాలను అంగీకరించి కెరీర్ లో జోరుగా ఉన్నాడు.. ప్రస్తుతం బన్నీ హరీష్ శంకర్ దర్శకత్వంలో 'దువ్వాడ జగన్నాథం' సినిమా చేస్తున్న సంగతి విధితమే.. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకొంటుంది.. వేసవి వినోదంగా సందడి చెయ్యడానికి రెడీ అవుతున్నది.. కాగా ఈ సినిమా పూర్తి అయిన అనంతరం బన్నీ లింగు స్వామి దర్శకత్వంలో తెలుగు, తమిళ ద్విభాషా చలన చిత్రాన్ని చేయనున్నాడు.. కాగా ఈ సినిమా చేస్తున్న సమయంలోనే మరో కొత్త ప్రాజెక్ట్ చేసే విధంగా బన్నీ ప్లాన్ చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.. ఆ ప్రాజెక్ట్ ను ప్రముఖ రచయిత వక్కంతం వంశీ దర్శకత్వంలో ఉండనున్నదట.. ఎన్టీఆర్ కు టెంపర్ వంటి హిట్ కథను అందించిన వంశీ   ఎన్టీఆర్ తో మొదటి సినిమాకు దర్శకత్వం వహించాల్సి ఉంది. కానీ ఎందుకనో ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు.. దీంతో వంశీ తన మొదటి సినిమా బన్నితో తెరకెక్కించే యోచనలో ఉన్నాడు.. ఈ సినిమా లగడపాటి శ్రీధర్ నిర్మించనున్నారు అనే టాక్ వినిపిస్తోంది.. అంతేకాదు "నా పేరు సూర్య... నా ఇల్లు ఇండియా" అనే ఆసక్తి కరమైన టైటిల్ కూడా నిర్మించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. కాగా అధికారికంగా ప్రకటన వెలువడల్సి ఉన్నది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com