శంషాబాద్ వద్ద ఫైటింగ్ జరుపుకొంటున్న "బెవర్స్"...
- February 14, 2017
ఎస్ క్రియేషన్స్ పతాకంపై పి.చందు, ఎం అరవింద్ సంయుక్తంగా నిర్మిస్తున్న బేవర్స్ చిత్రం మూడవ షెడ్యూల్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే తోంబై శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. మీ శ్రేయోభిలాషి వంటి ఉత్తమాభిరుచి గల చిత్రాలకు సంభాషణలు సమకూర్చిన రమేష్ చెప్పాల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సంజోష్, హర్షిత హీరో హీరోయిన్లుగా నటిస్తుండగా, డా.రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.
గెలిచాక అందరూ నమ్ముతారు... ఫ్యామిలీ అంటే ప్రయత్నాన్ని నమ్మేవాళ్లు.. అనే కథాంశంతో యూత్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. అన్ని కమర్షియల్ హంగులతో ముస్తాబవుతున్న ఈ చిత్రంలో తండ్రీ, కొడుకుల మధ్య వచ్చే భావోద్వేగ సన్నివేశాలు అందరినీ కంటతడి పెట్టిస్తాయి. ఈ చిత్రంలో ముద్దపప్పు ఆవకాయ ఫేం అభి, మధునందన్, అమృతం వాసు, విజయభాస్కర్, వెంకీ, షేకింగ్ షేషు, ఆర్జే హేమంత్, రాకేష్, ఫణి, వరంగల్ భాష తదితరులు నటిస్తున్నారు. సంగీతం - సునీల్ కశ్యప్, సాహిత్యం - సుద్దాల అశోక్ తేజ, భాస్కర భట్ల, అరవింద్ మండ్యం. ఎడిటర్ - ఎం.ఆర్.వర్మ, కెమెరా - కె.చిట్టిబాబు, ఆర్ట్ డైరెక్టర్ - రఘు కులకర్ణి, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్ - రాజీవ్.కె.రామా, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం - రమేష్ చెప్పాల.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









