ఐడీ కార్డ్స్ మీతో తీసుకెళ్ళండి: మినిస్ట్రీ
- February 15, 2017
మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, ఖతార్‌లో నివాసం ఉంటున్న ప్రతి ఒక్కరికీ 'ఐడీ కార్డులు మీతో అన్ని వేళలా ఉండేలా చూసుకోండి' అని సూచించింది. ఐడీ కార్డు ఒక్కటే వ్యాలీడ్ రెసిడెన్సీకి సంబంధించి 'ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ' అని మినిస్ట్రీ పేర్కొంది. అధికారులు చూపించమని అడిగినప్పుడు తప్పనిసరిగా ఐడీ కార్డ్ చూపించాలని మినిస్ట్రీ స్పష్టం చేసింది. ఒకవేళ ఐడీ కార్డ్ మిస్ అయితే వెంటనే జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్‌పోర్ట్స్‌కి ఫిర్యాదు చేయడం ద్వారా పోయిన ఐడీ కార్డ్ పొందడం లేదా కొత్త కార్డ్ పొందడం వీలవుతుందని కూడా తెలిపింది. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ పాస్‌పోర్ట్స్ అసిస్టెంట్ డైరెక్టర్ బ్రిగేడియర్ నాజర్ జబెర్ అల్ అట్టియా మాట్లాడుతూ, దేశం వెలుపల గనుక ఐడీ కార్డ్ పోయినట్లయితే, రెసిడెంట్స్‌కి తిరిగి రావడం కష్టమవుతుందని అన్నారు. డైరెక్టరేట్ ప్రపంచ వ్యాప్తంగా తమ అథారిటీస్‌కి, ఎయిర్‌లైన్స్‌కీ ఈ విషయమై సర్క్యులర్ జారీ చేయడం జరిగింది.ఎయిర్ పోర్టులు, ప్లాట్‌ఫామ్స్, ఎయిర్‌లైన్ డెస్క్‌లలో ఐడి కార్డుల్ని చూపిస్తే, వాటిని మినిస్ట్రీ వెబ్‌సైట్‌లో పరిశీలించి, వాటి వాలిడిటీని పోల్చి తదుపరి అనుమతిస్తారని మినిస్ట్రీ చెప్పింది. ఖతార్ వెలుపల ఐడీ కార్డ్‌ని పోగొట్టుకుంటే కొత్త కార్డ్ పొందడానికి అనేక ఇబ్బందుల్ని ఎదుర్కోవడంతోపాటుగా 200 ఖతారీ రియాల్స్ ఖర్చు కూడా భరించవలసి ఉంటుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







