రద్దయిన నోట్ల మార్పిడి: ఎన్నారైలకు గడువు పెరిగే అవకాశం
- February 15, 2017
భారతదేశంలో నరేంద్రమోడీ ప్రభుత్వం కరెన్సీ రద్దు నిర్ణయం తీసుకున్న తర్వాత, ఎన్ఆర్ఐల కోసం జూన్ 30 వరకు అవకాశం కల్పించింది. అయితే ఈ డెడ్లైన్ని సమీప భవిష్యత్తులో పెంచే అవకాశం ఉన్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ డైరెక్టర్ హోమి ఫిరోజ్ రనినా చెప్పారు. నవంబర్ 9 నుంచి 30 డిసెంబర్ వరకు విదేశాల్లో ఉన్నవారు మార్చ్ 31 వరకు రద్దయిన పాత నోట్లను మార్చుకునేందుకు వీలు కల్పించారు. నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించినప్పటినుంచి (నవంబర్ 8) విదేశాల్లోనే ఉన్నవారు జూన్ 30 వరకు రద్దయిన నోట్లను మార్పిడి చేసుకునేందుకు వీలు కల్పించారు. మోడర్న్ ఎక్స్ఛేంజ్ కంపెనీ నిర్వహించిన ఈవెంట్లో హోమి ఫిరోజ్ రనినా ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో సమాంతర ఆర్థిక వ్యవస్థ నకిలీ నోట్లు, నల్లధనం రూపంలో నడవకుండా ఉండేందుకే కరెన్సీ రద్దు నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకున్నట్లుగా ఈ ఈవెంట్లో ఇండియా అంబాసిడర్ టు ఒమన్ ఇంద్రా మణి పాండే తదితరులు అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







