అరటి హల్వా...
- February 15, 2017
కావలసిన పదార్థాలు: బాగా పండిన అరటిపళ్లు - 5, బెల్లం తురుము - 2 కప్పులు, నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు, మైదా - 2 టేబుల్ స్పూన్లు, పంచదార - అరకప్పు, యాలకుల పొడి - 1 టీ స్పూను.
తయారుచేసే విధానం: అరటిపళ్లని పలచగా చక్రాల్లా తరిగి, అరకప్పు నీటిలో మెత్తగా ఉడికించి చిదిమి పక్కనుంచాలి. మరో అరకప్పు నీటిలో బెల్లం కరిగించాలి. కడాయిలో నెయ్యి వేసి అరటి గుజ్జుని 6 -7 నిమిషాలు వేగించాలి. తర్వాత బెల్లం నీరు కలిపి చిన్నమంటపై 10 నిమిషాలు కలుపుతూ ఉడికించాలి. మిశ్రమం చిక్కబడిన వెంటనే పంచదార, యాలకులపొడి కలిపి మరో 7 నిమిషాలు ఉంచాలి. ‘గోల్డెన్ బ్రౌన్’ కలర్లోకి వచ్చిన తర్వాత మైదా కలపాలి (తడి పోవడానికి). రెండు నిమిషాల తర్వాత నెయ్యిరాసిన పళ్లెంలో మిశ్రమం సమంగా పరిచి, చల్లారిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







