IPL ఆరంభం, ముగింపు హైదరాబాద్‌లోనే...

- February 15, 2017 , by Maagulf
IPL ఆరంభం, ముగింపు హైదరాబాద్‌లోనే...

హైదరాబాద్: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్) 10వ ఎడిషన్ పూర్తి షెడ్యూల్‌ని బీసీసీఐ బుధవారం విడుదల చేసింది. ఏప్రిల్‌ 5 నుంచి మే 21 వరకు ఐపీఎల్‌ సందడి చేయనుంది. ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌లో భాగంగా డిఫెండింగ్‌ ఛాంపియన్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రన్నర్స్‌ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తలపడనుంది.
ఈ మ్యాచ్‌ ఉప్పల్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో ఏప్రిల్‌ 5న జరగనుంది. ఇదే స్టేడియంలో మే 21న ఐపీఎల్ ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. దేశవ్యాప్తంగా 10 వేదికల్లో 47 రోజులపాటు మొత్తం 60 మ్యాచ్‌లను నిర్వహించనున్నట్లు బీసీసీఐ తెలిపింది. ప్రతి జట్టు 14 మ్యాచ్‌లను ఇతర జట్లతో ఆడాల్సి ఉంటుంది.
అందులో 7 మ్యాచ్‌లు సొంత మైదానం ఆతిథ్యమిస్తుంది.
క్వాలిఫయర్స్‌, ఎలిమినేటర్స్‌ వేదికలను ఇంకా నిర్ణయించలేదు. మరోవైపు కింగ్స్‌ లెవన్‌ పంజాబ్‌ తమ రెండో హోమ్‌ గ్రౌండ్‌గా ఇండోర్‌ను ఎంపిక చేసుకుంది. దీంతో 2011 తర్వాత ఇండోర్‌లో మరోసారి ఐపీఎల్‌ మ్యాచ్‌లు జరగనుండటం విశేషం.
ధర్మశాల, రాయ్‌పూర్‌లకు మ్యాచ్‌లను షెడ్యూల్‌ చేయలేదు. 2017 ఐపీఎల్‌ కోసం ఫిబ్రవరి 20వ తేదీన బెంగళూరులో ఆటగాళ్ల వేలం జరగనుంది. రూ.2 కోట్ల నుంచి రూ. 10 లక్షల మధ్య కనీస విలువతో వేలం కోసం మొత్తం 351 మంది ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com