జులైలో హోవర్ ట్యాక్సీని ప్రారంభించనున్న దుబాయ్...
- February 16, 2017
దుబాయ్: చైనీస్ ప్రోటోటైప్ సెల్ఫ్ డ్రైవింగ్ హోవర్ ట్యాక్సీని ప్రయోగాత్మకంగా పరిశీలించినట్లు ట్రాన్స్పోర్ట్ అథారిటీ ప్రకటించింది. జులై నాటికి ఈ వాహనాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ఈ హోవర్ ట్యాక్సీ దూసుకుపోతుంది. ప్రయాణీకుడు తాను చేరాలనుకుంటున్న గమ్యాన్ని ఎంపిక చేసుకుని, హోవర్ ట్యాక్సీని టేకాఫ్ చేయవచ్చు. ఆ తర్వాత అది నిర్దేశిత ప్రాంతానికి చేరుకుంటుంది. ఈ మొత్తం ప్రక్రియ గ్రౌండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షించబడ్తుంది. 2 గంటలపాటు ఛార్జింగ్ చేస్తే, 30 నిమిషాలపాటు ప్రయాణిస్తుంది. ఇహాంగ్ సంస్థ ఈ చైనీస్ డ్రోన్‌ని తయారు చేసింది. 2030 నాటికి ఈ తరహా వాహనాల వినియోగం ఎక్కువగా ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. రోడ్లపై ట్రాఫిక్ ఇబ్బందులకు ఈ చైనీస్ డ్రోన్‌తో చెక్ పెట్టవచ్చు. ఎనిమిది ప్రొపెల్లర్స్‌తో ఈ క్వాడ్ కాప్టర్ పనిచేస్తుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







