తమిళనాడు సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన పళనిస్వామి
- February 16, 2017
తమిళనాట ఉత్కంఠకు ఎట్టకేలకు తెరదించారు ఇన్‌చార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎవరన్న విషయం గవర్నర్ తేల్చేశారు. శశికళ వర్గమే సీఎం పీఠం దక్కించుకుంది. చెన్నైలోని రాజ్‌భవన్‌లో పళనిస్వామి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 31మంత్రులు సామూహిక ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమానికి ఎమ్మెల్యేలు, అన్నాడీఎంకే నేతలు తరలివచ్చారు. గవర్నర్ విద్యాసాగర్ రావు..పళనిస్వామి చేత ప్రమాణం స్వీకారం చేయించారు. అనంతరం మంత్రులు ఒకేసారి సామూహికంగా ప్రమాణం చేశారు. పలు ముఖ్యశాఖలకు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. హోం, ఆర్థిక శాఖలు కూడా సీఎం పళని స్వామి చేతిలోనే ఉంటాయి.
అయితే మంత్రి జాబితాలో దినకరన్ పేరు లేకపోవడం గమనార్హం. కేబినెట్‌లో నలుగురు మహిళలకు చోటు లభించింది. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పళనిస్వామి విషయానికొస్తే.. జయ కేబినెట్‌లో రహదారులశాఖ మంత్రిగా పనిచేశారు. ఈయన గౌండర్ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. సేలం జిల్లా ఎడప్పడి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
మొత్తం 31 మందితో పళనిస్వామి కేబినెట్ అవతరించింది. శాఖల ప్రకారం మంత్రుల జాబితా..
పళనిస్వామి- ముఖ్యమంత్రి, హోం, ఆర్థిక శాఖలు
సి. శ్రీనివాసన్ -అటవీశాఖ
కెఎ. సెంగొట్టియన్- విద్య, క్రీడలు, యూత్ వెల్‌ఫేర్ శాఖలు
కె. రాజు - సహకారశాఖ
పి. తంగమణి - విద్యుత్,
ఎక్సైజ్ శాఖలు
డి. జయకుమార్- మత్స్యశాఖ
సి.వె. షణ్ముగం- న్యాయశాఖ
కె.పి. అన్బళగన్- ఉన్నత విద్యాశాఖ
డాక్టర్ వి. సరోజ- సాంఘిక సంక్షేమ శాఖ
ఎం.సి.సంపత్- పరిశ్రమల శాఖ
కె.సి. కరుప్పణన్- పర్యావరణ శాఖ
ఆర్. కామరాజ్- పౌరసరఫరాల శాఖ
ఒ.ఎస్. మణియన్- జౌళిశాఖ
కె.రాధాకృష్ణన్- గృహనిర్మాణ, పట్టణాభివృద్ది శాఖలు
సి.విజయ్‌భాస్కర్ -వైద్యశాఖ
ఆర్. దొరై కణ్ణు- వ్యవసాయశాఖ
కడంబూర్ రాజు- సమాచారశాఖ
ఆర్.బి. ఉదయ్ కుమార్- రెవెన్యూ శాఖ
ఎన్. నటరాజన్- పర్యాటక శాఖ
కె.సి. వీరమణి- వాణిజ్యపన్నుల శాఖ
కె.టి. రాజేంద్ర బాలాజీ- పాడిపరిశ్రమశాఖ
పి. బెంజమిన్- గ్రామీణపరిశ్రమల శాఖ
డాక్టర్ నీలోఫర్ కఫీల్- కార్మికశాఖ
ఎం.ఆర్. విజయ్ భాస్కర్- రవాణాశాఖ
ఎం.మణికందన్- ఐటీశాఖ
ఎస్. రామచంద్రన్- దేవాదాయ శాఖ
ఎస్. వలర్మతి - బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖ
పి. బాలకృష్ణ- పశుసంవర్థకశాఖ
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







